కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జే. శివకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఇదివరకు పనిచేసిన సుధాకర్ లింగంపేట్ కు పోలీస్ స్టేషను బదిలీ అయ్యారు.