Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

పద్మ అవార్డులు అందుకోనున్న వారికి చిరంజీవి అభినందనలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులకు ఎంపికైన వారికి ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్, అనంత్‌ నాగ్, శేఖర్ కపూర్ జీ, ‘రుద్రవీణ’ చిత్రంలో సహనటి శోభనకు అభినందనలు తెలియజేశారు. అలానే అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వీరంతా అవార్డులకు అర్హులని చిరంజీవి పేర్కొన్నారు.

Related posts

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

8 వసంతలు’ నుండి ఫస్ట్ సింగల్ అవుట్

TNR NEWS

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌…?

TNR NEWS

డాకు మహారాజ్’ ఓస్ట్‌పై ఉత్తేజకరమైన అప్డేట్ ని వెల్లడించిన థమన్

TNR NEWS

చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం

TNR NEWS