*కోదాడ టౌన్* . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 26 బడ్జెట్లో కార్పొరేట్ పెద్దలకు రాయితీలు కల్పించి పేద ప్రజలపై పన్నుల భారం మోపినట్లు ఉందని ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు
శనివారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లో మోడీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన తెలియజేశారు
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతూ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అని చెప్పి మనుషుల మధ్య అంతరాలు పెంచే బడ్జెట్ ప్రవేశపెట్టారని వారు విమర్శించారు కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు కల్పించి పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని వారన్నారు వ్యవసాయ రంగానికి కంటిచూపు చర్యంగా బడ్జెట్లో కేటాయించాలని వారు విమర్శించారు ప్రతి సంవత్సరం బడ్జెట్ అంకెలు పెంచుతున్నప్పటికీ కేటాయింపుల్లో పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ రంగానికి
నామమాత్రంగానే కేటాయింపులు కంటి చూపు చర్యలు మాత్రమేనని వారు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మేదరమట్ల వెంకటేశ్వరరావు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు దేవరం వెంకటరెడ్డి సిపిఎం పట్టణ నాయకులు అడ్వకేట్ వి. రంగారావు ఏనుగుల వీరాంజనేయులు పట్టణ నాయకులు దాసరి శ్రీను నాయకులు లక్ష్మీనారాయణ బాబు. జానీ మియా వీరబాబు నాగయ్య పాపాచారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు