Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన మునగాల విజ్ఞానోత్సవం కార్యక్రమాన్ని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ప్రయోగపూర్వకంగా స్వయంగా తెలుసుకున్న విషయాలు పూర్తి విజ్ఞానాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.మండల విద్యాశాఖ సౌజన్యంతో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం భాగస్వామ్యంతో ఆద్యంతం అట్టహాసంగా నిర్వహించిన ఈ సైన్స్ దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన చిన్నారులు *76 సైన్స్ ఎగ్జిబిట్స్* ప్రదర్శించారని *సైన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తెలిపారు.* విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ తో పాటు నృత్యరూపకాలు కూడా అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.విశ్రాంత మండల విద్యాధికారి *కీర్తిశేషులు గంధం నర్సయ్య విజ్ఞాన ప్రాంగణంలో* నిర్వహించిన ఈ కార్యక్రమంలో, 

రిటైర్డ్ మండల విద్యాధికారులు గుండు సైదులు, ఓరుగంటి రవి తో పాటు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు, 

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాసరెడ్డి,టి.లక్ష్మి నరసింహారావు, ప్రిన్సిపల్ బోర సైదయ్య గౌడ్ లను,సైన్స్ ఉపాధ్యాయులు శ్రీరామ్ శ్రీనివాస్, ఎండి యాకుబ్ అలీ, శ్రీనివాసరావు , గోవర్ధన్, జ్యోతి, ఫిజికల్ డైరెక్టర్ ఆజం అలీ తదితరులను *అబ్దుల్ కలామ్ సైన్స్ ఫోరం పక్షాన ఘనంగా సన్మానించారు.* ఈ విజ్ఞాన ఉత్సవంలో చక్కని ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను,బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు వల్లపట్ల దయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ సైన్సు గణిత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.


 

Related posts

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత… పెంచికల్ పేట్ మండలం ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS