Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశానుసారము జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై వి గోవర్ధన్ మాట్లాడుతూ. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇల్లు చేరుకునే విధంగా చూడాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే ప్రమాదవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో వాహనదారులు ఎప్పటికప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి చట్ట వ్యతిరేకమైన పనులను చేస్తూ కనిపించినట్లయితే వారి గురించి వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం. సెల్ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడపడం లాంటి పరిణామాలకు పాల్పడి రోడ్డు ప్రమాదాలకు బలి కాకూడదని ఆయన సూచించారు. ప్రతి వ్యక్తి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి మన వ్యక్తిగత సమాచారాన్ని ఎదుటివారికి తెలవకుండా గోపయ్యంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అపరిచిత ఫోన్ కాల్ వచ్చిన వాట్సాప్ లో అపరిచిత మెసేజ్లు వచ్చిన వాటిపై రెస్పాండ్ కాకూడదని సూచించారు. అతివేగం హానికరమని గుర్తించి వేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామస్తులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు..

Related posts

రాష్ట్రస్థాయిలో కోదాడ శ్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS