కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం మంగళవారం అహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి తొలి పలుకులు తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు పలుకగా,సభకు అధ్యక్షతను కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి వహించారు.ముఖ్య అతిథిగా కోదాడ (డి.ఎస్.పి) ఎం. శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.. ముందుగా కొండపల్లి రాఘవమ్మ రంగారావు చిత్రపటానికి పూలమాల సమర్పించి విద్యార్థులను ఉద్దేశించి డి.ఎస్పి. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…
కష్టపడి చదివిన చదువు వృధా కాదని,జీవితంలో తలెత్తుకొని స్థిరపడేలా చేస్తుందని, అందుకే ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. చదవడంలో క్రమశిక్షణ కలిగిన సైనికుల మాదిరిగా విద్యార్థులు ప్రస్థానం కొనసాగిస్తే తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారని,పాఠాలు బోధించిన గురువులు సంతోషిస్తారని ఆయన అన్నారు.ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు,అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మంచి పౌరుడుగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సెల్ ఫోన్ ను విద్యార్థులు మంచి మార్గానికి ఉపయోగించి,చెడు మార్గానికి దూరంగా ఉంచాలని,తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా చదివి ప్రయోజకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల బదిలీపై వెళ్లిన లైబ్రేరియన్ ఎం. ప్రభాకర్ రెడ్డిని, యూ. డి. సి అన్వేష్ నీ, కొత్తగా వచ్చిన జ్యోతిలక్ష్మి నీ,సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఆర్. పిచ్చి రెడ్డి, జి. యాదగిరి, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, జి. నాగరాజు, పి.తిరుమల, ఎస్.గోపికృష్ణ, ఈ.నరసింహారెడ్డి,ఎస్. కే.ముస్తఫా,ఈ. సైదులు, ఎస్. కే.ఆరిఫ్,ఎన్. రాంబాబు,కే. శాంతయ్య,కే. జ్యోతిలక్ష్మి,ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, టి. మమత, డి.ఎస్.రావు మొదలగువారు పాల్గొన్నారు…..