సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిర వృద్ధ అనాధాశ్రమాన్ని సూర్యాపేట జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్ .శ్రీవాణి ఆశ్రమాన్ని సందర్శించి. ఆశ్రమంలో ఉన్న వృద్ధులను పరామర్శించి వారి యోగక్షమాలను అడిగి తెలుసుకుని ఆశ్రమంలో ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల సంతృప్తిని వ్యక్తపరిచి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు తగు రీతిన ఆహారాన్ని ఇవ్వడం పట్ల. అభినందించారు తదుపరి వృద్ధులకు బ్రెడ్లు మరియు గ్లాస్ లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులతో పాటలు పాడించి వారితో కాసేపు సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ. ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ సేవలు అభినందనీయమని అలాగే భవిష్యత్తులో ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా అక్కడ ఉన్న వారిలో కొంతమందికి కనీసం ఆధార్ కార్డులు మరియు ప్రభుత్వం నుంచి. పొందే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరిన నేపథ్యంలో. తగు చర్యలు తీసుకొని ఆధార్ కార్డులు లేనివారికి ఆధార్ ఇప్పించేలాగా అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పెన్షన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి మునగాల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆశ్రమ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి న్యాయవాదులు చింతకుంట్ల రామిరెడ్డి సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ . మురళి . వీరభద్రరావు లక్ష్మీకాంత్ సత్యనారాయణ పిళ్లై వాస్తు నిర్మాణ్ వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
previous post