Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

కాకినాడ : మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసం శెట్టి ప్రసన్న కుమార్ (35)కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26 కేజీల బియ్యం, రెండు వేల అయిదువందల నగదు అందజేసి సహకరించింది. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు చేతుల మీదుగా అందించారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) ద్వారా సిఎం సహాయనిధికి ప్రోఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8లక్షల రూపాయల వైద్యాన్ని ప్రయివేటుగా చెల్లించి పొందారని మరో రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వున్నందున సిఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం రూ.10లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్ళే అవకాశం లేనందున వచ్చే వారం గ్రీవెన్స్ కి వెళ్లాలని సూచించారు. జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్న దృష్ట్యా ఇతని కుటుంబ కష్టాలు తెలుసుకుని సిఎం సహాయ నిధి త్వరగా అందించే సహాయం చేయాలన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఇతని కుటుంబానికి పోషణ సహాయం అందించాలని కోరారు. ఎటువంటి పని చేసే శక్తి లేక భార్య ఆసరాతో ఇద్దరు అమ్మాయిలతో ఆవేదన చెందుతున్న అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు, కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.

Related posts

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

రాళ్లకత్వలో ఘనంగా మల్లన్న జాతర – ముఖ్య అతిథులుగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి

TNR NEWS

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

TNR NEWS

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs