Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

కోదాడ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసి బదిలీపై వెళ్లిన శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం కోదాడకు వచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తునాం కృష్ణ లు కామారెడ్డి జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి,కోదాడ ఎం.వి.ఐ జిలానిలకు స్వాగతం పలికి శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు.అనంతరం లారీ యజమానులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. లారీ డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలువురు లారీ యజమానులు రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తూనం కృష్ణ, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, యలమందల నరసయ్య, చంద్రమౌళి, బాబా, గన్నా లింగయ్య, దొంగరి సుధాకర్, కొల్లు ప్రసాద్,రఫీ, చంద్రశేఖర్ రెడ్డి, దొంగరి గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తి మృతి

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

Harish Hs

ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలి  రైతులు నిపుణుల సూచనలు పాటించాలి  జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ 

TNR NEWS

నేటి నుండి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Harish Hs