పిఠాపురం : శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన పిర్ల సూర్యనారాయణ అనే సూరిబాబు ఫిబ్రవరి 28వ తేదీన గుండెపోటుతో అకాలంగా మరణించారు. శనివారం ఉదయం ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు నెల్లిపూడి గ్రామంలో గల పిర్ల సూర్యనారాయణ స్వగృహానికి వెళ్ళి ఆయన మరణం పట్ల తీవ్రదిగ్బాంతిని వ్యక్తం చేశారు. పిర్ల సూర్యనారాయణ సోదరులైన పిర్ల సత్యనారాయణ, పిర్ల యాతిమా, కుమారులైన పిర్ల నాగసూరి, పిర్ల కోటేశ్వరరావు, పిర్ల మురళీలను పరామర్శించి పిర్ల సూర్యనారాయణ మరణం పట్ల ప్రగాడసానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని, ఆయన గతంలో కత్తిపూడి కర్షక పరిషత్తు (పిఏసీఎస్) చైర్మన్ గా రైతులకు, ప్రజలకు అనేక సేవలందించారన్నారు. అదేవిధంగా నెల్లిపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లుతో ఓటమి చెందారని, పిర్ల సూర్యనారాయణ జీవితకాలమంతా ప్రజలతో స్నేహంగా మెలిగే వారన్నారు. నెల్లిపూడి గ్రామ అభివృద్ధికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడరు. జ్యోతుల శ్రీనివాసు వెంట నెల్లిపూడి గ్రామ జనసేన నాయకులు తలపంటి నాగేశ్వరరావు, తలపంటి వీరబాబు, నెల్లిపూడి గ్రామానికి చెందిన పిర్ల నూకరాజు, జ్యోతుల సీతారాంబాబు, సఖినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.