Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది – వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత

పిఠాపురం : మార్చి 12వ తేదీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా కాకినాడ జిల్లా వైయస్సార్‌సిపి అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, రీజనల్‌ కో`ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల వారీగా కార్యమ్రాలు నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గం వైయస్సార్‌సిపి ఇంచార్జ్‌ వంగా గీతావిశ్వనాధ్‌ అన్నారు. ఈ సంధర్భంగా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు పార్టీ శ్రేణులందరూ ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఆదే రోజు నిర్వహించబోయే యువత పోరు కరపత్రాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. విద్యారంగానికి పెద్ద పీట వేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజల తరపున నిలబడి నిరుద్యోగభృతి, ఫీజురియంబర్స్‌మెంట్‌, ఉద్యోగ అవకాశాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. 12వ తేదీన వైయస్సార్‌సిపి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామన్నారు. అనంతరం కాకినాడ జిల్లా వైయస్సార్సీపి కార్యాలయానికి వెళ్ళి జిల్లా వేడుకల్లో పాల్గొని, అనంతరం విద్యార్ధులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు గండేపల్లి రామారావు (బాబీ), కొప్పన శివనాధ్‌, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్డినీడి సుజాత, వైసిపి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

TNR NEWS

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

TNR NEWS

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

TNR NEWS

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra