Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకంక్షలు_

పన్నులు కట్టలేక రొమ్ములు కోసేసుకున్న నంగేలమ్మ

ఆత్మగౌరవానికి,

దేశానికి ఆవాసమైన ఆకాశమంత అంభేడ్కరుని ఆశయానికి తోడునిలిచిన అమ్మ రమాభాయి త్యాగానికి,

ఆర్యులు అద్దిన అంధకారంలో అగ్గిమిరుగుడై మెరిసి అక్షరాలు దిద్దించిన తల్లి సావిత్రీబాయి సాహసానికి,

అడవితల్లి కన్న ఆయుధమై

కులమగదురహాంకురుల గుండెలమీద ఫిరంగై పేలిన ఫూలన్ దేవి ప్రతీకారానికి

 

నాదేశంలో పుట్టిన ధీరవీర త్యాగాలతల్లులకి

__అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

ఆకాశం గొడ్డుబోయి

భూమి బీడైనప్పుడు

కాలం కటికరొమ్ములు పిండి మా ఆకలినాలుకలమీద మనుగడ పాలుపొంగించిన

ఎందరో మాత్రుమూర్తులకి నా మట్తితల్లులకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

జాతీయ అంతర్జాతీయ ఆకలిఅంగట్లో

బువ్వగింజలై మొలకెత్తి

మానవజాతి గొంతులో జీవగంజైపారుతు కనీసం

పరిగెగింజలకి కూడా నోచుకోలేని

ఎందరో కూలీతల్లులకి  శ్రమైకచేతులకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

ఆటకి అక్షరానికి దూరమై

పసితనంలోనే అమ్మతనాన్ని సంకనేసుకొని

తోడబుట్టిన తమ్ముళ్లని తన బాల్యపుఎదలమీద మోస్తు.

వెలివాడ చెక్కిల్లమీద కన్నీటిదారలైపారిన ఎందరో అమ్మలాంటి అక్కలకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

అడవితల్లి కొప్పుమీద కూర్చొని

సామ్రాజ్యవాద గుండెలమీద గుద్ది

స్వచ్ఛమైన మనుషులుగా బతికి పోరాడి అమరులైన

ఎందరో ఆదివాసి త్యాగవల్లులకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

జీవితాలు ఇంటిపరువులుగా ఉరితీయబడి

కులాలగుమ్మాలకి వేలాడుతున్నప్పుడు

ఆ కులాలకుతికెల్ని కొరికి మా అంటరాని చెక్కిళ్లని ముద్దాడిన

ఎందరో అగ్రవర్ణప్రియురాళ్లకి ప్రేమతో..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

రోడ్లని తమవాకిల్లుగా ఊడుస్తు

మానవ మలినాల్ని ఎత్తిపారబోస్తు

ప్రపంచాన్ని పరిశుభ్ర పరుస్తున్న

ఎందరో పారిశుద్ధకార్మికులైన నా పెద్దవ్వల చీపుర్లకి

చేతులెత్తి చెప్తున్న

అంతర్జాతీయా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

పురుషహాంకారాన్ని వినయంగా అలంకరించుకోలేక

మొగుడి ఆదిపత్యాన్ని ముప్పూటలా అలవర్చుకోలేక

ఆ కండకావురాల్ని కాళ్లకింద తొక్కిపట్టి

ఈ మగమహా సామ్రాజ్యామ్మీద ఒంటరిగా నిటారుగా నిలబడ్డ

ఎందరో ఆత్మగౌరవ తల్లులకి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 

ఇక అలాగే చివరిగా……

తెత్తె తింటం సత్తె ముండమోత్తమని

కట్టుకున్నోడి కట్రాయార్లుతుకుతు

ఎలక్ట్రిక్ కుక్కర్లో వంటావార్పులై ఉడుకుతు

కార్లాన్ పరుపులపై కాపురల్ని బొర్లిస్తున్న

ఎందరో సీరియల్ బానిసలకి సాంప్రదాయ సోకులకి

అంతర్జాతీయా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

 

మీ….

 

డా|| సునీల్ కుమార్ యాండ్ర

 

శ్రీ విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత

 

సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత & ఫ్రీలాన్సర్ జర్నలిస్టు

Related posts

TNR NEWS

శీర్షిక : పెళ్లి

Dr Suneelkumar Yandra

నాటి జ్ఞాపకాలు..

Dr Suneelkumar Yandra

జీవరాశుల సమ్మేళనం – జీవకోటికి ఎనలేని నరకం

Dr Suneelkumar Yandra

TNR NEWS

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

TNR NEWS