సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం,మునగాల మండల పరిధిలోని నాన్ కెనాల్ ఆయకట్టు గ్రామాలకు వెంటనే ఎస్సారెస్పీ జలాలను విడుదలకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవ తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సోమపంగు శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.మోతె మండలంలోని అన్ని గ్రామాల, మునగాల మండల పరిధిలోని నాన్ కెనాల్ ఆయకట్టు గ్రామాలైన రేపాల,నర్సింహూలగూడెం, జగన్నాథపురం,విజయరాఘవా పురం,సీతానగరం,కలకోవ రైతులు ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడి యాసంగి సీజన్లో అధిక మొత్తంలో వరి సాగు చేశారని,ఇప్పుడు నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రాంతాలకు నీటి విడుదల చేసి నాన్ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలన్నారు.