వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో మలిదశ ఉద్యమ సమయంలో 2009 నుండి 2014 వరకు విరోచితంగా జీ పోరాటం చేసి పోలీస్ కేసులకు గురి అయిన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి ప్రశంస పత్రాలను రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు అందివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉద్యమ సమయంలో అమర నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారుడు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి మరియు సామాజికవేత్త బట్టు సాంబయ్య , ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు తంగెళ్ళ భాస్కర్ ,పరికి నవీన్, కొత్తగట్టు ప్రభాకర్ ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆకుల సాంబరావు మాట్లాడుతు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నెలకు 25 వేల పెన్షన్ సౌకర్యం తదితర సౌకర్యాలు ఉద్యమకారుల కల్పించాలని డిమాండ్ చేస్తూఈనెల 27, 28 తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ రాజన్న సన్నిధి వరకు ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహా పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నల్లబెల్లి మండలంలో మలిదశ ఉద్యమంలో పోరాటం చేసి పోలీస్ కేసులకు గురి అయిన ప్రతి ఉద్యమకారుడికి ప్రశంస పత్రాలను ఉద్యమకారుల ఫోరం నుండి అందివ్వ నున్నట్టు ఆకుల తెలిపారు.