- నిర్వహించిన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం : ఈ నెల14 వ తేదీన 12వ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ మరియు విజయఉత్సవ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం వద్ద నిర్వహిస్తున్న నేపథ్యంలో సన్నాహక సమావేశాలలో భాగంగా జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు దుర్గాడ గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఇంటింటి ప్రచారంలో బాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా చిత్రాడ గ్రామానికి 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచ్చేసి ఆవిర్భావ దినోత్సవం సభ విజయోత్సవసభగా విజయవంతం చేయవలసిందిగా దుర్గాడ గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరూతూ…. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీలో జనసైనికులు, జనసేన నాయకులు నిస్వార్ధంగా పనిచేస్తూ జరిగిన ఎన్నికలలో జనసేనపార్టీ అభ్యర్దులను నూటికి నూరు శాతం గెలిపించి, కూటమి అభ్యర్దులను గెలిపించి నేడు కూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్నా భవిష్యత్త్ మనదే అనే విధంగా భవిష్యత్తు కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళ్తూ జనసేనపార్టీని గెలిపించుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతి జనసైనికుడు, జనసేన నాయకులు త్రికర్ణశుద్ధిగా జనసేనపార్టీ సేవకు, ప్రజాసేవకు అంకితం కావాలని జ్యోతుల శ్రీనివాసు అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాడగ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీస్థాయిలో పాల్గొన్నారు.