సూర్యాపేట: మహిళల హక్కుల కై నిరంతరం పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమేనని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 23వ వార్డులో సంఘం జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడుతూ అఖిలభారత ప్రజాతంత్రంమహిళా సంఘం 1981 మార్చి 10, 11, 12 తేదీల్లో అప్పటి మద్రాసు నగరం ఇప్పటి చెన్నై నగరంలో ఏర్పడిందన్నారు. అంతకుముందు అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంఘం పనిచేస్తూ వచ్చిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం గా, పశ్చిమ బెంగాల్లో పశ్చిమబంగా గణతంత్ర మహిళా సమితిగా మహారాష్ట్రలో కామ్ గారు మహిళ సమితిగా అలా కేరళ ,తమిళనాడు పంజాబ్ అంటే అనేక రాష్ట్రాల్లో మహిళా సంఘం ఏర్పడి పనిచేస్తూ వచ్చిన సంగం 1981లో జరిగిన మొదటి మహాసభతో అఖిలభారతస్థాయి రూపం తీసుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. ఐద్వా దేశవ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోని మహిళలను సమకరించి మహిళల సమస్యల కోసం బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించడం జరిగిందన్నారు. సమాజంలో అన్ని రకాల అణచివేతలను తొలగించడం కోసం మహిళా సంఘం పనిచేస్తుందని స్త్రీ, పురుషులకు సమానంగా అనేక హక్కులు సాధించింది మహిళా సంఘం అన్నారు. స్త్రీ లకు చట్టరీత్యా హక్కులున్నా స్త్రీలకు అందుబాటులో లేవు లేవన్నారు. అత్యాచారాలు, కుటుంబంలో హింస, బహుభార్యత్వం, బాలవివాహాలు,అధిక ధరలు ఇలా స్త్రీలను అనేక రకాల సమస్యలు ఉన్నాయని వాటికి వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు పిట్టల రాణి, శశిరేఖ, సైదమ్మ, నీరజ, శాలిని, ఆగమ్మ, ఉష రాణి, బిక్షవమ్మా తదితరు పాల్గొన్నారు
