అమలాపురం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యు డు అయిన హరీష్ బాలయోగికి శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు ఆయన స్వగహానికి వెళ్లి ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎంపీ స్థాయిలో మొట్టమొదటిగా పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది అని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.