పిఠాపురం : బుధవారం ఉదయం 8గంటల నుండి సహృదయ మిత్రమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన కీర్తిశేషులు టి.వి.ఎల్ నరసింహారావు 3వ వర్ధంతి సందర్భంగా సహృదయ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో త్రీనీటి లూధరన్ సెర్చ్ ఆవరణలో జరగబోయే వైద్య శిబిరము డాక్టర్ పి.ఎన్.రాజుచే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తమ పాత రిపోర్ట్స్ మరియు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని మిత్రమండలి సభ్యులు కోరారు. ఇతర వివరాలకు సి.హెచ్.సతీష్ ను ఈ నెంబర్లలో 7989928289, 9347582057 సంప్రదించాలన్నారు.