పిఠాపురం : ఒలివల్ అబాకస్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పరీక్షల్లో లెవెల్ 1,2,3లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అద్భుత విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ బి హబ్ లో రాష్ట్ర స్థాయి అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు స్టేట్ లీగల్ అడ్వకేట్ విజయ్, ప్రముఖ గైనకాలజిస్ట్ డా. సుష్మా చేతుల మీదుగా పిఠాపుర నియోజకవర్గం యు.కొత్తపల్లి వివిఎస్ విద్యాసంస్థల 16 మంది విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. అలాగే రాష్ట్రస్థాయి బెస్ట్ అబాకస్, వేదిక్ మాథ్స్ టీచర్ అవార్డ్స్ గెడ్డం మంగలక్ష్మి, సుగుణా కుమారి అందుకోగా స్టేట్ లెవెల్ బెస్ట్ స్కూల్ అవార్డు వివిఎస్ స్కూల్ తరపున ప్రిన్సిపల్ ధనలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా వివిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అబాకస్, వేదిక్ మాథ్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పరీక్షల్లో రాష్ట్రస్థాయి అవార్డులు తమ విద్యార్థిని విద్యార్థులకు రావడం చాలా సంతోషంగా ఉంది అని, అలాగే వివిధ సాంస్కృతిక కళారూపాలతో పాటు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పిల్లలు మంచి ప్రతిభ కనబరిచే విధంగా అన్ని రంగాలలో బోధన నిర్వహిస్తున్న తమ వివిఎస్ స్కూల్ టీచర్స్ కి, అలాగే ఒత్తిడి లేని విద్యతో పాటు అన్ని రంగాలలో విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యాసంస్థను నిర్వహిస్తున్న తమ కరస్పాండెంట్ అనిశెట్టి కృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, ఒలీవల్ అబాకస్ అకాడమీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.