- నేడు మాజీ ఎమ్మెల్యే పెండెం జనసేన పార్టీ తీర్థం
- ముహుర్తం ఖరారు… తన అనుచర వర్గంతో భారీ ర్యాలీగా మంగళగిరికి పయనం
పిఠాపురం : పిఠాపురం ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఈ ఊరి పేరు తెలియని వారుండరు. ఈ క్రెడిట్ అంతా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్‌ది అనడంలో అతిశయోక్తికాదు. అయితే ఆయన పిఠాపురం నియోజవర్గం నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బిజెపిల కూటమి అభ్యర్ధిగా పోటీ చేసి అఖండ మోజార్టీతో విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్గంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి స్థానం కల్పించారు. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు జనసేన పార్టీలో జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు అయ్యిందని పెండెం దొరబాబు పత్రికా సమావేశంలో తెలిపారు. అయితే ప్రస్తుతం పిఠాపురంలో ఇదే హా(హి)ట్ టాపిక్‌గా మారింది. నేడు భారీ ఎత్తున పెండెం దొరబాబు తన అనుచర వర్గంతో భారీ ర్యాలీగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరాడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయాని రంగులను సైతం మార్పిస్తున్నారు. ఇదిలా వుండగా తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ శాసన సభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకి రాష్ట్ర కేబినేట్‌లో చోటు కల్పిస్తానన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు ఆ విషయం మాట్లాడకపోవడం చాలా తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైయస్సార్‌సిపి పార్టీకి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తేల్చి చెప్పారు. దొరబాబు జనసేన పార్టీలో జాయిన్ అయ్యిన తరువాత ఇప్పటివరకూ పిఠాపురం ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్‌ను తొలగించి ఆ పదవిలో పెండెం దొరబాబును నిమయమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న బొగొట్ట.