తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి అన్నారు. బుధవారం, మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణకై చేసిన 30 సంవత్సరా లసుదీర్ఘ పోరాటంనుగుర్తించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం వర్గీకరణ అమలకు నిర్ణయం తీసుకుందన్నారు. 2024 ఆగస్టు1న సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ రెడ్డి ఎస్సీ ల వర్గీకరణ అమలు కార్యరూపం దాల్చేందుకు జస్టిస్ శమీమ్ అక్తర్ తో ఏక సభ్య కమిషన్ వేసి, కమిషన్ కు రాష్ట్రమంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని చైర్మన్ గా నియమించడంతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకొని కమిషన్ నివేదికను త్వరగా పూర్తి చేసుకొని అసెంబ్లీలో మార్చి18న వర్గీకరణ బిల్లును ఆమోదించి,నెలరోజుల లోపే గవర్నర్ ఆమోదం పొంది వెంటనే ఆమోదించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిషన్ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి మండలి సభ్యులకు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మహానుభావుడు, ప్రపంచ మేధావి, సమసమాజ స్థాపకుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 14న వర్గీకరణ అమలుకు తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని ఇది చరిత్రలో నిలిచిపోయే రోజనిఅన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయంలో భాగమే ఎస్సీల ఎబిసి వర్గీకరణ అని, ఇది ఎవరికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని మాల సోదరులను కోరారు.