Tnrnews.in
తెలంగాణ

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

వీర తెలంగాణ సాయుద రైతాంగా పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య స్మారక భవనము నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, చందా చంద్రయ్య,ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు ఆర్పించారు.

 బుధవారం మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుల బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నిజం రాజు రాచరిక పాలన, దొరల భూస్వాముల వెట్టి చాకిరి వ్యతిరేకంగా మట్టి మనసుల గుండె చప్పుడై సమ సమాజం కోసం సాయుద పోరు సమరమై దొరల పెత్తందారు విధానాన్ని నేలా కూల్చిన మహా వీర వనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు. నేటి యువతకు ఆమె జీవితం ఆదర్శప్రాయం నేటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బి కృష్ణారెడ్డి, ఎస్ పిచ్చయ్య, డి ఉపేందర్, జి మల్లారెడ్డి, ఎన్ సైదులు, బి సుందరయ్య, ఎస్ నాగరాజు, కె ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది – పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS