నాన్నపై…. ఎంతోమంది కవులు, కళాకారులు, గాయకులు, నాయకులు, రచయితలు ఎన్నో రకాలుగా నాన్న గురించి చెప్పిన ఏదో తెలియని లోటు. వ్యాసకర్తగా నా కలముతో చెప్పాను ఈరోజ నాన్న గురించి వ్రాయి అని. అప్పుడు నా కలము నాతో చెప్పిన మాట “నాన్న గురించి నా దగ్గర అక్షరాలు లేవు” అన్నది. చాలా బాధేసింది. ఈ ప్రపంచంలో నాన్నకు అక్షరాలు కరువయ్యాయి అంటూ…..
- అక్షరాలే కక్ష కట్టాయేమో నాన్న కష్టాన్ని కలముతో కదలనివ్వడం లేదు….
- అక్షరాలే లక్షలై నాన్న లక్ష్యాన్ని అడ్డుకున్నాయేమో…
- పదాలను కలిపిన పెదాలకు తెలియదేమో నాన్న ప్రేమ….
- చూసే కన్నులు కక్ష కట్టాయేమో కంటి నుండి కన్నీటిని రాకుండా….
- దేహము చూపలేదు రగిలిన హృదయం చాటున రోదనని….
- నాన్న భుజాలు చెప్పలేదు నిన్ను మోసిన బరువు బాధని…
- ఆకలితో అదిరిన పేగుల శబ్దమును ఉదరము అడ్డుకుందేమో….
- ఎండకు నడిచిన నాన్న పాదాలకి పోక్కుల శలిమలు పుట్టాయేమో……
- పదాలు పెదవులు దాటి ప్రయాసపడే అక్షరాలు ఆయాస పడుతున్నాయి….
- నాన్న గురించి వస్తే నాలుక నాట్యం చేయడం ఆపేసింది…
- పండ్ల మధ్య పదిలంగా ఉన్న అంటూ ఊహిసలాడిందే గాని నాన్న గురించి ఊసెత్తలేదు నాలుక……
- చిన్నప్పుడు నీ చెంపలపై ముద్దాడిన నాన్న ప్రేమను నీ తుడిచేసాయేమో అక్షరాలు….
- నువ్వు ఎదుగుతుంటే నాన్న ఆనందానికి అక్షరాలు కరువయ్యాయి….
- పసిడి వయసులో పాలకు ఏడ్చితే నీ ఆకలి తీర్చడానికి అమ్మ కోసం వెతకాడేమో నాన్న……
- నాన్న కంటి నుండి జారే ప్రతి కన్నీటి బొట్టుని సమాధి చేశాయి అక్షరాలు….
- కంటికి రెప్పలా కాపాడిన నాన్నకి కవితలు కరువయ్యాయి….
- అక్షరమా ఎందుకంత కక్ష కట్టావు నాన్న పై..?
- మగువని అక్షరాలు ఆనందంలో ముంచి ప్రకృతితో పోల్చావు. నాన్నకు పరిచయం లేకుండా చేశావు…
- మగువనీ పసిడి వన్నెలు పాలధారలు అంటూ పలకరించావే….
- నిండు జాబి లాంటి నీ మోము అంటూ మగువ కాళ్ళ దగ్గర మోకరిల్లావ్ కదా ! ఇంకా చెప్పాలంటే…
- ప్రేయసిని ప్రకృతితో పోల్చావ్, పాలతో పోల్చావ్, పువ్వులతో పోల్చావ్, పుడమితో పోల్చావ్, మాణిక్యాలతో పోల్చావ్, మకరందంతో పోల్చావ్, పసిపిల్లల నవ్వుతో పోల్చావ్, పారే నదితో పోల్చావ్, కోకిల గానాలతో పోల్చావ్, నెమలి నాట్యాలతో పోల్చావ్, లేత లేక దూడలతో పోల్చావ్, లేడి పిల్లతో పోల్చావ్, వీచే గాలితో పోల్చావ్, ఊగే కొమ్మతో పోల్చావ్, కన్నెపిల్ల మనసుని తెల్లని కాగితంతో పోల్చావ్, తన సొగసు సువాసనని మల్లెపువ్వు వాసనతో మలిచావు….. కళ్ళని కలవ పువ్వుతో పోల్చావ్, కురులని నయగారా జలపాతంతో పోల్చావ్…
అపరిమితమైన అందానికి పరిమితమైన అందాలను జోడించావ్.. కాలగమనంలో కలిసే శరీరానికి ఆనందాల అక్షరాలతో సత్కరించారు… కానీ తరాలు మారిన తరగని ఆస్తి నాన్న… జీవానికి మూలం నాన్న కాదా! అలాంటి నాన్నకు అన్నింట ఆటంకాలే..
- పాలిచ్చే పాడి పశువుల నుండి ఫలాలు ఇచ్చే తోట వరకు..
- అన్నం పెట్టే అన్నదాత నుండి బాధ నుండి విముక్తి కలిగించే భగీరధుడి వరకు…
- కొలువుల జాడ నుండి కన్న ప్రేమ వరకు….
- నీ జీవితంలో వెలుగుల కోసం తన జీవితంలో చీకట్లో నింపుకుని….
- మంచి మనసుతో….. మాసిన బట్టతో… కాలమే కాటేసిన కాటి వరకు ఒంటరివై తరాలకు తరగని చిరునామావై బిడ్డల భవిష్యత్తును బంగారం చేస్తున్న నీకై పలకని పదాల వరుసను పాతరేస్తా…
లక్షణంగా ఉన్న నాన్నపై కక్ష కట్టిన అక్షరాలను లక్ష ఉరి తాళ్లతో ఊరి మధ్యలో ఉరితీస్తా……
కుటుంబ పెద్దగా ఎన్నో బాధలు పడుతున్న ప్రతి తండ్రికి ఈ వ్యాసరచన అంకితం…..
డా. సునీల్ కుమార్ యాండ్ర
వ్యాసకర్త