Tnrnews.in
ప్రత్యేక కథనం

విస్తరాకు ….. మనిషి జీవితం

మిత్రమా* *”విస్తరాకును”* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *’భోజనానికి’* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *”ఆకుకు మట్టి”* అంటకుండా జాగ్రత్త వహిస్తాము.

తిన్న మరుక్షణం *’ఆకును’ (విస్తరిని)* మడిచి *’దూరంగా’* పడేస్తాం.

“మనిషి జీవితం”* కూడా అంతే ఊపిరి పోగానే *”ఊరి బయట”* పారేసి వస్తాము..

*’విస్తరాకు’* పారేసినప్పుడు సంతోషపడుతుంది.

ఎందుకంటే *’పొయేముందు ఒకరి ఆకలిని’* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *’తృప్తి’* ఆకుకు ఉంటుంది.

*’సేవ’* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *’సేవ’* చేయండి.

మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *’వాయిదా’* వేయకండి.

ఆ అవకశము మళ్లీ వస్తుందని అనుకుంటే *’కుండ’* ఎప్పుడైనా పగిలిపోవచ్చు.

అప్పుడు *’విస్తరాకుకు’* ఉన్న *’తృప్తి’* కూడా మనకి ఉండదు..

ఎంత *’సంపాదించి’* ఏమి లాభం? *’ఒక్కపైసా’* కూడా తీసుకుపోగలమా?

కనీసం *’మన ఒంటిమీద బట్ట’* కూడా మిగలనివ్వరు..

అందుకే *’ఊపిరి’* ఉన్నంత వరకు *”నలుగురికి”* ఉపయోగపడే విధంగా *’జీవించండి’*…

*ఇదే జీవిత పరమార్ధం*

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు

TNR NEWS

నేతాజీ సుభాష్ చంద్ర బోసు వర్ధంతి సందర్బంగా వారి గురించి ప్రత్యేక కథనం

Dr Suneelkumar Yandra

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS

పోటీ!

Dr Suneelkumar Yandra

ఆగని మారణహోమం – రాజకీయం