స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి జులై 1తో 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోదాడలోని అన్ని ఎస్బిఐ శాఖల ఉద్యోగులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన ఉద్యోగులను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్యాంకు 71వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోదాడ లోనే ఈరోజు తమ బ్యాంకు ఉద్యోగులు 90 మంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రక్తదానంతో ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలు కాపాడుతామని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ ఐయీతగాని మహేష్, అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ చింతపల్లి భాస్కర్, బ్రాంచ్ మేనేజర్లు జంగాల వీరస్వామి, సందీప్ కుమార్,దవనం నరేష్, వంశీకృష్ణ,మేకల సాయికృష్ణ,పెర్ని సూర్యతేజ,నాగిరెడ్డి, వెంకటరత్నం, చిట్టిబాబు, పవన్ శర్మ, సాయి,సౌజన్య,శైలజ,అపర్ణ,భవాని, జావేద్ పాషా,మోర వెంకటయ్య, షరీఫ్, రాము, నందన్ రెడ్డి,ఉమా మహేష్,తదితరులు పాల్గొన్నారు………..