మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరయు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హావ్ హెచ్. పి. వి, వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో మహిళా పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్పు తగ్గించవచ్చని, అందువల్ల మహిళలు స్వీయ పరీక్ష చేసుకోవాలని తెలిపారు. అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తోటి మహిళలకు కూడా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఉద్యోగ విధుల్లో నిమగ్నమై ఉంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్లు మహిళల్లో సాధారణంగా వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాధి గుర్తింపు పద్ధతులు, ఆరోగ్యకర జీవన శైలి గురించి ప్రెజెంటేషన్లు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమoలో అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్, సెక్రటరీ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి, డాక్టర్లు సి .పద్మిని కుమార్, గూడూరి శ్రీలత, పోలీస్ కార్యాలయ ఏ ఓ శశికళ, ఎస్.ఐ గీత,మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
