Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

కోదాడ అభివృద్ధిని ఓర్వలేక చౌకబారు విమర్శలను చేయడం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు తగదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కోదాడ గంజాయి అడ్డాగా మారింది అంటూ మల్లయ్య యాదవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అక్రమ గంజాయిపై పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అనేకమంది గంజాయి అక్రమంగా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసిన సంఘటనలు మీ దృష్టికి రాలేదని విమర్శించారు.పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాజాత ప్రదర్శనను ఏర్పాటు చేసి అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీస్ అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో కూడా మార్పు రావాలని పూర్తిస్థాయిలో గంజాయిని రూపుమాపేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోదాడలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని గత పాలకుల మాదిరిగా అవినీతిమయంగా మారలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ పంట పెట్టుబడి సహాయం సన్న బియ్యం పంపిణీ ఇలా అనేక పథకాల నేరుగా ప్రజలకు అందుతున్నాయని పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని రాబోయే స్థానిక సంస్థలలో కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.

 

Related posts

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

TNR NEWS

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

మనస్థాపం తో యువతి ఆత్మహత్య 

TNR NEWS