కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన కళాశాల వసతిగృహంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి వంగపల్లి పద్మ విద్యార్థులకు స్నేహితుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు ఒకరి చేతికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని స్నేహానికి గుర్తుగా విద్యార్థులు అంతా కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని బంధాల కన్నా స్నేహబంధం ఎంతో విలువైనదని స్నేహితులు ఇచ్చిన సలహాలతో సమాజంలో గొప్పవారైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని అన్నారు. అనంతరం ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు………
