సూర్యాపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ప్రజా సమస్యలపై సర్వేలు నిర్వహించి మండల కేంద్రాలలో ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామన్నారు.జిల్లాలో అనేక సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయని వాటిని పాలకులు పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ప్రజలుటైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి ఇంట్లోఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. అంటూ వ్యాధులు,విష జ్వరాలు ప్రబలకుండా ఉన్నందుకు అన్ని గ్రామ, పట్టణలలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పి.హెచ్.సి సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని వార్డులలోవైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచారా వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కో లిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

previous post