Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు

ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ పద్మనాభ రెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సోమవారం ఆయన 12వ వర్ధంతి సందర్భంగా కోదాడ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం హైకోర్టులో నిరంతరం న్యాయపోరాటం సాగించి బాధితులకు అండగా నిలిచిన మహనీయుడు పద్మనాభ రెడ్డి అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తన గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గట్ల నరసింహారావు, కోదాడ అధ్యక్షులు అబ్దుల్ రహీం, కార్యదర్శి వెంకటాచలం, సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి, శరత్ బాబు, యశ్వంత్, సిలివేరు వెంకటేశ్వర్లు, ఉయ్యాల నరసయ్య, హేమలత, మురళి, శ్రీధర్,వెంకన్న, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు……

 

Related posts

గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి  ప్రిన్సిపాల్ కనిక వర్మ

TNR NEWS

*రైతులు IKP కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – కీసర సంతోష్ రెడ్డి.*

Manideep

ప్రజా వేదికఆధ్వర్యంలో ఉగ్రదాడి అమరులకు నివాళులు

Harish Hs

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

TNR NEWS

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Harish Hs

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS