ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ పట్టణంలోని పలు వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం మున్సిపల్ అధికారులతో
కోదాడ పట్టణంలోని స్థానిక 12వ వార్డు రామిరెడ్డి పాలెం లో రోడ్లకు ఇరువైపుల ఉన్న కంప చెట్లు గుబురుగా పెరిగి ప్రజల వాహనాలకు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నందున వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు వార్డు సమస్యలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వార్డు ప్రజలు జాగ్రత్త పడాలని వారు సూచించారు వార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు చందా నిర్మల రావెళ్ల కృష్ణారావు వేమూరి విద్యాసాగర్ చామర్తి బ్రహ్మం కాజా అనిల్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు