పిఠాపురం : ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్య్ర భారత దేశంలో ప్రతీ ఒక్కరూ కృషి చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షా అధ్యక్షత వహించగా, వారి శ్రీమతి అప్షాన్, కుమార్తె ఫాతిమున్ జోహారా కూడా పాల్గొని ప్రసంగించారు. పీఠాధిపతి సోదరులు మెహబూబ్ పాషా, అహ్మద్ ఆలీషా, కబీర్ షా, స్కూల్ ప్రిన్సిపాల్ షాజహాన్ వేదికను అలంకరించి ప్రసంగించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరి సూరిబాబు, ఎ.వి.వి. సత్యనారాయణ, ఎన్.టి.వి. ప్రసాద్ వర్మ, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు, సిబ్బంది, విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం స్వీట్స్ పంపిణీ చేశారు.