Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పాదగయా క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తాం – ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్

పిఠాపురం : పిఠాపురం శాసనసభ్యుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు 10,000 చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ కు ఎనలేని అభిమానం అని, వరలక్ష్మీ వ్రతం పూజ సందర్భంగా పసుపు కుంకుమతో పాటు చీర 22వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమై అంబిక, బ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని అనే 5 బ్యాచిల్గా నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతానికి విచ్చేసే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడటం జరిగిందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నిటినీ పరిశీలించామని వరలక్ష్మి వ్రతాలు సవ్యంగా నిర్వహించాలని తెలిజేసామని అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కె.కె, చక్రవర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కౌడా ఛైర్మన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు

Dr Suneelkumar Yandra

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra