కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ జి.శ్యామ్ తెలిపారు. డీఎస్సీ శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే వివిధ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులతో సంచలన విజయాలను సాధించారని ఆయన వివరించారు. విద్యార్థులను సోమవారం ప్రత్యేకంగా శ్యామ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో 75 శాతం పైగా విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి అద్భుత విజయాలను సాధించిన అభ్యర్థులకు శ్యామ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో సమాజానికి మీ వంతు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ విజయ సాధనలో తమ వంతు కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలను శ్యామ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆరు స్టేట్ ర్యాంకులతో పాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకుల్లో పదిమంది అభ్యర్థులు విజయం సాధించారని శ్యామ్ వివరించారు. ఎస్ జి టి విభాగంలో జిల్లా టాప్ ర్యాంకులు సాధించిన తొమ్మిది మంది అభ్యర్థుల వివరాలను కూడా శ్యామ్ వివరించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఉచిత ఆన్లైన్ శిక్షణ పొందిన 260 మందికిగాను 63 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగిందని శ్యామ్ వివరించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన బి.హరీష్, బి.దిలేష్, వి.రమ్యశ్రీ, డి.బాలు నాయక్, ఎం.డేనియల్ కుమార్, సి.హెచ్.భవాని వారిలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా పేపర్ ర్యాంకులతో విజయనగరం జిల్లా ఫస్ట్ ర్యాంక్ కె.శ్రీకాంత్, గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంకు జి.వి.ఎస్.సరళాదేవి, కర్నూలు జిల్లా 2వ ర్యాంక్ వి.కోదండ రాముడు, శ్రీకాకుళం జిల్లా 3వ ర్యాంక్ బి.హరీష్, అనంతపురం జిల్లా 3వ ర్యాంక్ బి.జ్యోతి, విశాఖ జిల్లా 3వ ర్యాంక్ కె.రాజు నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా 5వ ర్యాంక్ టి.దుర్గాప్రసాద్, కడప జిల్లా 5వ ర్యాంక్ టి.సత్యనారాయణ, చిత్తూరు జిల్లా 7వ ర్యాంకు పి.బాల మహేష్, తూర్పుగోదావరి జిల్లా 9వ ర్యాంకు బి.దేవి మణికంఠ సాధించారన్నారు. అదేవిధంగా ఎస్ జి టి విభాగంలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఎస్.కె.నయాబ్ రసూల్, అనంతపురం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సి.హెచ్.దివ్యశ్రీ ,కడప జిల్లా 2వ ర్యాంకు ఎస్కే మోహుతాజ్, విశాఖ జిల్లా 3వ ర్యాంకు కె.శ్రీదేవి, శ్రీకాకుళం జిల్లా 4వ ర్యాంక్ ఎం.అనురాధ, కృష్ణా జిల్లా 4వ ర్యాంకు ఎల్.నాగసాయి లక్ష్మీ, విజయనగరం జిల్లా 5వ ర్యాంకు కె.తులసి, ప్రకాశం జిల్లా 8వ ర్యాంక్ ఆర్.రవీంద్ర, కర్నూలు జిల్లా 8వ ర్యాంకు ఎన్.పెద్ద సుబ్బలక్ష్మయ్య సాధించారని శ్యామ్ వివరించారు.

next post