Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

పిఠాపురం : యువ సాహితీవేత్త, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, పిఠాపురం యువ కవి డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి విశాఖపట్నంలో అభినందన సత్కారం జరిగింది. విశాఖపట్నంలోని రాసి కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది. రాసి కేర్ ఫౌండేషన్ ప్రతినిధులు సుహాసిని, ఆనంద్, గౌరీ నాయుడునీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా, రంగాలలో గౌరీ నాయుడు చేస్తున్న విశేషమైన సేవలను గుర్తించి సత్కరించడం జరిగిందని సంస్థ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ ఒక వ్యక్తికి మాతృభాష గుర్తింపునిస్తుందని, భాషాపటిమతో మాతృభాషలో సామర్థ్యాన్ని సంపాదిస్తే మరి ఏ ఇతర భాషలోనైనా సులభంగా నేర్చుకోవచ్చునని పేర్కొన్నారు. నన్నయ సహస్రబ్ది ఉత్సవాలు నిర్వహించిన సంస్థ సత్కరించడం ఆనందంగా ఉందని గౌరీ నాయుడు తెలిపారు. సత్కరించి

Related posts

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

రుద్ర పీపుల్స్ పవర్ పొలిటికల్ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం