రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో తదితర అంశాలపై ఏం జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. శాఖపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులకు సూచించారు.

previous post
next post