మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో శుక్రవారం అటుగా వెళ్లిన పోలీసుల వాహనం రోడ్డు పై మోరయించింది. రోడ్డు కోతకు గురై గత కొన్నాళ్ళుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలు మార్లు భారీ వాహనాలు కూడా రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడ్డ సంఘటన లు ఉన్నాయి. తాజాగా పోలీసు వాహనం కు మరమ్మత్తులు చేపట్టడానికి మరో వాహనం రావడం తో ఎక్కడి వాహనాలు అక్కడే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా రోడ్డు మారమ్మత్తు లు చేపట్టి ప్రయాణికులు ఇబ్బంది తీర్చాలని డిమాండ్ చేస్తూన్నారు.