అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని గోపిరెడ్డి నగర్ వినాయక ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు పట్టణంలోని స్థానిక గోపిరెడ్డి నగర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ నల్లజాల జగన్నాథం, మాజీ వార్డ్ కౌన్సిలర్ కోలా లక్ష్మీ ప్రసన్న కోటిరెడ్డి, పాల్గొని దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద అన్నదానం చేయడం పుణ్య కార్యమని ఇలాంటి అన్నదాన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నదాన వితరణ స్వీకరించి భగవంతుని ప్రేమకు, కృపకు ప్రార్ధులు కావాలని తెలిపారు అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందినీయమని వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు సాలువలతో పూలమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు రావెళ్ళ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి బాడిషా రామారావు కమిటీ సభ్యులు ఎర్రసాని మహేష్ రెడ్డి, పెదిరెడ్డి రవీందర్ రెడ్డి, అంబురి వెంకటరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి ,గడ్డం వెంకటరెడ్డి, గాయం బ్రహ్మానందరెడ్డి ,పింగళి వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రసాని వెంకటరెడ్డి పరిపూర్ణచారి, ,మహిళా భక్తులు, భక్తులు, పెద్ద ఎత్తన పాల్గొన్నారు

previous post
next post