కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనియెడల జర్నలిస్ట్ సంఘాలను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో హెచ్చరించారు. జర్నలిస్టుల పెన్షన్ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోనూ *పెన్షన్* విధానాన్ని ప్రవేశపెట్టి సీనియర్ జర్నలిస్టులకు *రూ.25 వేలు* నెలవారీ పెన్షన్ ను అందజేయాలని ఏనుగుల వీరాంజనేయులు కోరారు.
భారతదేశంలోని 30 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్టులకు నెలవారీ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇంకా 11 రాష్ట్రాలలో పెన్షన్ పథకం అమలు చేయాల్సివుంది. మన తెలంగాణ రాష్ట్రం కూడా పెన్షన్ ఇవ్వని రాష్ట్రాల జాబితాలోవుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రభుత్వం ను ఒప్పించి సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.