Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వీగా భద్రతా అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో తరుచూ గంజాయి, డగ్ర్స్ దందాలు వెలుగుచూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుందంటున్నారు నిపుణులు. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Related posts

అభివృద్ధి లో జిల్లా లో కోదాడ అగ్ర స్థానం

Harish Hs

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్

TNR NEWS

హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు

TNR NEWS

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

TNR NEWS

మహిళలు సామాజిక సమానత్వం సాధించాలి

TNR NEWS