తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్ పై 28 శాతంగా ఉన్న GSTని 18శాతానికి తగ్గించారు. దీంతో ఒక బస్తాపై రూ.30 వరకు తగ్గింది. బ్రాండును బట్టి గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260 అయింది. రూ.370 ఉన్న ధర రూ.330కి చేరింది. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టేవారికి కాస్త ఉపషమనం లభించినట్టైంది. కాగా ఏపీ, తెలంగాణలో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.