కాకినాడ : జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిత్యం ప్రజా సేవ చేస్తూ ఉన్నారు. కాకినాడ పట్టణంలో జగన్నాధపురంలోని 15వ డివిజన్ కి చెందిన వాడ్రేవు దుర్గాప్రసాద్ మృతి చెందారని విషయం తెలుసుకున్న జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) వారి కుటుంబ సభ్యులును సోమవారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడంతో వారి కుటుంబానికి తన వంతు సహాయంగా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 303 మందికి ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని, నిత్యం ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.నూకరాజు, పి.బత్తిరాజు, వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, సుజాత, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
- చేవెళ్ళ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం
తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ దగ్గర సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో 24మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు.
