Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక

పిఠాపురం  : ఈనెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆర్చరీలో హైయెస్ట్ స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈనెల 15వ తారీకు రాత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన ఆర్చర్స్ లిస్టును రిలీజ్ చేశారు. అందులో పిఠాపురం నుండి ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికయింది. ఎంపికైన పిఠాపురం అర్చర్ ఈనెల 22 నుంచి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయస్థాయి అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయస్థాయిలో ముమ్మిడి నిత్యశ్రీ పాల్గొంటుందన్నారు. అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో పిఠాపురం నుండి మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో ఎంపికైనట్లు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. నిత్యశ్రీ వయసు 6 సంవత్సరాలని, తను ఆర్చరీలో ఎన్నో పథకాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కె.పద్మనాభం నిత్యశ్రీని అభినందించారు.

Related posts

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం

Dr Suneelkumar Yandra

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

TNR NEWS

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS