సూర్యాపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7, 8 తేదీలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని ఈ సర్వేలను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా ప్రజలు అంటూ వ్యాధులు, విష జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రజలు జ్వరాలతో బాధపడుతుంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అన్ని జబ్బులకు టెస్టులు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పారిశుద్ధ్య నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో నెలకొన్న సమస్యలపై నవంబర్7,8 తేదీలలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వేలు నిర్వహించి సమస్యలపై నవంబర్ 9న జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, జిల్లా నాయకులు పులుసు సత్యం, పోషణ బోయిన హుస్సేన్, జంపాల స్వరాజ్యం, గుంజ వెంకటేశ్వర్లు, సోమపంగా జానయ్య, ఆరే రామకృష్ణారెడ్డి, కొండమీది రాములు, అంజాపల్లి లక్ష్మయ్య, కల్లేపల్లి భాస్కర్, షేక్ సైదా హుస్సేన్,కో oడమడుగుల చిన్న వెంకటేశ్వర్లు, జాజుగల్లా ముత్తయ్య, శిగ శ్రీను, చిన్న బోయిన వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
