సూర్యాపేట జిల్లా మద్దిరాలమండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టి పి టి ఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ )2025 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ లను గౌరవ మద్దిరాల మండల విద్యాధికారి తండు వెంకటనారాయణ గౌడ్ మరియు గౌరవ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం వీరన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న మరియు జిల్లా ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ “బాధ్యతలకు నిలబడు -హక్కులకై కలబడు”అనే నినాదంతో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్న సంఘం టిపిటిఎఫ్ అని, ప్రభుత్వ విద్యావ్యవస్త బలోపేతానికి కృషి చేసే సంఘం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అని అన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ డి ఎ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి-పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని, పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలుపరచాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంపల సాల్మన్ గంగాధర సురేష్ కుమార్లు జిల్లా నాయకులు కోడిపాక మల్లికార్జున్ పొన్నాల వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ కరుణాకర్,రజిత, శోభారాణి, రాజేశ్వరి, విష్ణుకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు
.