ది కోదాడ లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్రా వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు కావడంతో మంగళవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో గల వారి నివాసానికి లారీ అసోసియేషన్ నాయకులు వెళ్లి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కు 1985 నుంచి నేటి వరకు గత 40 సంవత్సరాలుగా లారీ యజమానులు, రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. వారి మృతి కోదాడ లారీ అసోసియేషన్ కు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తూనం కృష్ణ, అసోసియేషన్ సెక్రటరీ యలమందల నరసయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, మాజీ అధ్యక్షులు కనగల నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు ఆవుల రామారావు, మాజీ కార్యదర్శి విలాస కవి నరసరాజు, పెద్ది అంజయ్య, ఆల్తా హుస్సేన్, పెద్ది చంద్రమౌళి, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు……….