Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

దామాషా పద్ధతిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

 

  • బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు

 

  • త్వరలోనే కుట్టుమిషన్ల పంపిణీ

 

  • ఆదరణ 3.0తో కుల, చేతివృత్తుల వారికి శాశ్వత ఉపాధి

 

  • కార్పొరేషన్ చైర్మన్లకు అన్ని విధాలా ప్రాధాన్యం : మంత్రి సవిత

 

  • భువనమ్మకు మంత్రి సవిత అభినందనలు

 

విజయవాడ : జనాభా దామాషా పద్ధతిలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇదే విషయమై ఇప్పటికే బీసీ మంత్రులతో సమావేశాలు సైతం నిర్వహించామన్నారు. త్వరలోనే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందజేయనున్నామని వెల్లడించారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో 10 వివిధ బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల చేతివృత్తుల అభివృద్ధికి ఏవిధమైన ఆధునిక పరికరాలు అందజేయాలన్న అంశంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలన్న సంకల్పంతో టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు తీసుకురాగా, ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనుబడిన తరగతులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి కుల, చేతి వృత్తి దారులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. 2014-19 మధ్య కాలంలో బీసీల సర్వతోముఖాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో పథకాలు అమలుచేశారన్నారు. అనంతరం వచ్చిన జగన్ బీసీల ద్రోహిగా మిగిలారన్నారు. బీసీలను అన్ని విధాలా అణగదొక్కారన్నారు. 2019-24 మధ్య వెనుకబడిన తరగతులు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయావన్నారు.

 

  • కుల వృత్తులకు ఆధునిక పరికరాలు

 

2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బీసీలకు మరోసారి మంచి రోజులు వచ్చాయన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు కోసం కేంద్రానికి పంపామన్నారు. బీసీల రక్షణ చట్టం ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు. బీసీ మంత్రులతో రెండు పర్యాయాలు సమావేశాలు సైతం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా కుల, చేతివృత్తిదారులకు ఆదరణ 3.0 పథకం కింద ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. కుల, చేతివృత్తిదారులకు శాశ్వత ఉపాధే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

 

  • బీసీ బిడ్డల విద్యకు ప్రాధాన్యం

 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. గత ప్రభుత్వం పెట్టిన డైట్, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరు చేశామని, ఇటీవల మరో రూ.60 కోట్లు అందజేశామని తెలిపారు. అన్ని హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేశామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసిన కోచింగ్ ఎందరో బీసీ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారన్నారు.

 

  • బీసీ పాలక మండళ్లకు విధులు, నిధులు

 

బీసీ పాలక మండళ్లను ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూడకుండా వాటికి విధులు, నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. దామాషా పద్ధతిలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించినున్నట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు సీఎం చంద్రబాబు త్వరలోనే తీపికబురు అందిస్తారని మంత్రి తెలిపారు.

 

భువనమ్మకు మంత్రి సవిత అభినందనలు

 

లండన్ లో పత్రిష్టాత్మకమైన రెండు అవార్డులను మంగళవారం అందుకోనున్న నారా భువనేశ్వరికి మంత్రి సవిత అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ లండన్ లోని ఇనిస్ట్యిటూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) సంస్థ నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు ప్రకటించడం హర్షణీయమన్నారు. అదే వేదికపై ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్ కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారన్నారు. ప్రపంచ కప్ గెలుచుకున్న మహిళా టీమిండియా జట్టుకు మంత్రి సవిత అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి సవితను కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కుడిపూడి సత్తిబాబు, రోణంకి కృష్ణంనాయుడు, దేవంద్రప్ప, నందం అబద్ధయ్య, మరుపిల్ల తిరుమలేశ్వరరావు, మళ్ల సురేంద్ర, సీఆర్ రాజన్, పేరేపి ఈశ్వర్, వీరంకి వెంకట గురుమూర్తి, సీహెచ్.సావిత్రి, రెడ్డి అనంతకుమారి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వివిధ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్స్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్, వమ్మి బాలాజీ, పెంకే జగదీష్ ,జయబాబు గుడాల, కడలి వెంకటేశ్వరరావు, కేతా శ్రీను, లక్ష్మణరావు టేకుముడి, మధుసూదనరావు అనసూరి, చిట్టిబానా రామలిగేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.

Related posts

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే పెండెం

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

TNR NEWS

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

పురపాలక దిక్సూచి ‘జ్యోతులసీతారామమూర్తి’ – 2025ఫిబ్రవరి 27న ప్రధమ వర్ధంతి

Dr Suneelkumar Yandra

అన్నమయ్య ఆత్మగా శ్రీవారి స్వరసేవలో తరించిన.. ధన్యజీవి గరిమెళ్ళ

Dr Suneelkumar Yandra