Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

హైదరాబాద్  : అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు బుధవారం జూబ్లీహిల్స్ లో నిర్వహించిన వికలాంగుల సమావేశంలో పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచుతామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా గద్దనెక్కిన రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్ల పాలన కావస్తున్న నేటికీ వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న తీరు బాధాకరమని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడుగడుగునా వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అందుకు అనేక ఉదాహరణలో ఉన్నాయని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన MSME పాలసీల్లో వికలాంగులకు రిజర్వేషన్ లేకుండా చేయడం రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన నేటికీ ఆమెపై చర్యలు తీసుకోకపోవడం జగిత్యాల జిల్లాలో కలెక్టర్ వద్ద తన సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన వికలాంగుడిని పోలీసులు లాక్కెళ్ళిన వారిపై చర్యలు తీసుకోకపోవడం లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయని అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం పార్టీని ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలని ముఖ్యంగా తెలంగాణలో ఒక్క వికలాంగుల సమాజానే కాకుండా అధికారంలోకి రాకముందు సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ జూబ్లీహిల్స్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఎంతటి వారినైనా ఇంటి బాట పట్టిస్తారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ధీరావత్ మహేష్ నాయక్ నిరుద్యోగ వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మల్లేష్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం నాయకులు జంజీరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS

బాబా సాహెబ్  డా “బి . ఆర్ .అంబేద్కర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళిలు

TNR NEWS

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

TNR NEWS

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

TNR NEWS

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs