మోతె : ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా మోతె మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.సర్వేలో సోషల్ ఆడిట్ డి.ఆర్.పి రేచల్, సిబ్బంది శిరీష లు పాల్గొని ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులతో మాట్లాడి,ఉపాధి హామీ పనుల వివరాలను,కూలీల జాబితాలు, వేతనాల చెల్లింపులను అడిగి తెలుసుకొని ధృవీకరించారు.
