November 8, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.  ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంట వెయ్యాలి.  వరి, పత్తి, మిర్చి, ఇతర వాణిజ్య పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.  రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి.  పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిపులను వెంటనే విడుదల చేయాలి.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

సూర్యాపేట: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి ఐకెపి కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కాంట వేసి లిఫ్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతాంగం ఆరు గాలాలపాటు వ్యవసాయం చేసి ఐకెపి కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి లిఫ్ట్ చేసి రైతాంగానికి వెంటనే బిల్లులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐకెపి కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు గడుస్తున్న వాటిని నేటి వరకు కాంటాలు వెయ్యలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఐకెపి కేంద్రాలకు లారీలను చేసి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఇతర వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు ఎకరాకు 30 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. పత్తి పంటకు ఎకరాకు 50 వేలు, ఇతర వాణిజ్య పంటలకు 70 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి సహాయం అందించాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిపులును వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్ మెంట్,స్కాలర్ షిపులును మరింత పారదర్శకంగా అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు వీటిని చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. పెండింగ్ బకాయిలను చెల్లించి ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీ పేద విద్యార్థులకు చదువు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ని 1800 ప్రైవేట్ కాలేజీలో చదివే,14 లక్షల మంది విద్యార్థులకు 8,042 కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్,రూ. 1924 కోట్లు స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మొత్తంరూ. 9,966 కోట్లు పెండింగ్ పెట్టిందని పేర్కొన్నారు. వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది అన్నారు. వీటి విడుదల కోసం గత 20 రోజులుగా విద్యార్థి సంఘాలు యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మిగతారూ. 900 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కో లిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.

Related posts

మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లకు నాయకులకు ప్రతి ఒక్కరి ఒక్కరికి ధన్యవాదాలు.  మీడియా మిత్రులకు ధన్యవాదాలు.  మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS

భారత పర్యటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలి

Harish Hs

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS